Home Page SliderNational

ముంబైలో భారీ వర్షాలు

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మరోసారి వరుణుడు విజృంభిస్తున్నాడు.దీంతో ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు ముంబైలో రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఈ క్రమంలో ముంబైలోని పాఠశాలలకు అక్కడి ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఈ భారీ వర్షాలతో ముంబైలోని జనజీవనం అస్తవ్యస్థమవుతోంది.