ఏపీలో పలు జిల్లాల్లో తీవ్ర వడగాలు
ఏపీలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 84 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. పార్వతీపురం మన్యం జిల్లాలోని పాలకొండ, సీతంపేట మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీస్తాయని అంచనా వేసింది. శ్రీకాకుళం-9, విజయనగరం-13, మన్యం-11, అల్లూరి-9, అనకాపల్లి-1, కాకినాడ-4, తూర్పుగోదావరి-8, పశ్చిమగోదావరి-1, ఏలూరు-8, కృష్ణా-7, గుంటూరు-8, బాపట్ల జిల్లాల్లోని 5 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని పేర్కొంది.చిన్నారులు,వృద్దులు,మహిళలు ఉదయం 11 గంటల తర్వాత వెళ్లరాదని సూచించింది.సాధ్యమైనంత వరకు నీరు ఎక్కువగా తీసుకుని సాయంత్రం 4 గంటల వరకు ఇంటికే పరిమితమవ్వాలని తెలిపింది.