గుజరాత్‌లో భారీ వర్షాలు
గుజరాత్ రాష్ట్రాన్ని భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. ఈ కారణంగా విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. వదోదరలో గత 24 గంటలలో కుండపోత వర్షం కురిసింది. 33 సెంటీమీటర్ల వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. వందల ఎకరాలలో పంట నాశనమయ్యింది. అహ్మదాబాద్ నుండి కచ్ వెళ్లే జాతీయ రహదారిపై కూడా భారీగా వరద నీరు చేరిపోయింది. దీనితో పలు రైల్ సర్వీసులు నిలిచిపోయాయి. ఆగస్టు 31 వరకూ గుజరాత్‌లో కుండపోతగా భారీ వర్షాలు కురుస్తాయని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరించింది.

