నేడు ఏపీలో భారీ వర్షాలు
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో ఏపీ ప్రజలకు వాతావరణశాఖ మరోసారి పిడుగులాంటి వార్తను అందించింది. అదేంటంటే రాబోయే 24 గంటల్లో ఏపీలో పిడుగులతో కూడిన అతి భారీ వర్షాలు పడతాయని తెలిపింది. కాగా ఇవాళ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని తెలిపింది.అయితే ఇది రేపటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీని ప్రభావంతో ఈ రోజు కృష్ణా,ఎన్టీఆర్,గుంటూర్,పల్నాడు,ప్రకాశం,నెల్లూరు,బాపట్ల జిల్లాల్లో కొన్నిచోట్ల వర్షాలు పడతాయని తెలిపింది. కాగా రేపు అల్లూరి,ఏలూరు,కృష్ణా,ఎన్టీఆర్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. అయితే మిగిలిన జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయని వెల్లడించింది. ఈ భారీ వర్షాలతో ఈదురు గాలులతోపాటు పలుచోట్ల పిడుగులు కూడా పడే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు ఏపీ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఈ భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అవసరమైతేనే తప్ప బయటికి రావొద్దని అధికారులు సూచించారు.