నాలుగు రోజులు విస్తారంగా వర్షాలు
ఒడిశా, ఛత్తీస్‌గఢ్ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఏపీలో రాష్ట్రమంతటా రుతుపవనాలు విస్తరించాయి. వీటి ప్రభావంతో రాబోయే నాలుగు రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. మంగళ, బుధ, గురువారాల్లో కోస్తా జిల్లాల్లో అక్కడక్కడ భారీవర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.