తెలుగు రాష్ట్రాలలో మళ్లీ భారీ వర్షాలు
ఉభయ తెలుగు రాష్ట్రాలను గత రెండు రోజులుగా భారీ వర్షాలు ముంచెత్తిన విషయం తెలిసిందే. కాగా ఈ వర్షాలు మరో రెండు రోజులపాటు కొనసాగుతాయని వాతావరణశాఖ వెల్లడించింది. తెలంగాణాలోని హైదరాబాద్,భద్రాద్రి,నల్గొండ,ఆదిలాబాద్,పెద్దపల్లి జిల్లాలలో ఉరుములు ,మెరుపులు,ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడే అవకాశముందని పేర్కొంది. మరోపక్క ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ,దక్షిణ కోస్తాలో ఇవాళ పిడుగులతో కూడిన భారీ వర్షాలు,మిగతా చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. అయితే ఈ వర్షాలు రేపు సాయంత్రానికి తగ్గుముఖం పట్టే అవకాశముందని వాతావరణశాఖ వెల్లడించింది. ఈ భారీ వర్షాల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలలోని ప్రజలు అందరు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరించింది.