చెన్నైలో మళ్లీ భారీ వర్షాలు
మిచౌంగ్ తుఫాన్ దాటికి అతలాకుతలమైన చెన్నైను వర్షాలు ఇంకా వెంటాడుతున్నాయి. మరోసారి వాతావరణ శాఖ చెన్నై, పాండిచ్చేరిలలో భారీ వర్షాలు కురవవచ్చంటూ అలెర్ట్ జారీ చేసింది. దీనితో ఈ నగరాలలో స్కూళ్లు, పాఠశాలలకు నేడు కూడా సెలవు ప్రకటించారు. ఈ వర్షాల కారణంగా తుఫాన్ సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. తమిళనాడులోని, కోయంబత్తూరు, దిండిగల్, పుదుక్కొట్టై, తంజావూరు, నీలగిరి ప్రాంతాలలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మిచౌంగ్ తుఫాను కారణంగా ఇప్పటికే చెన్నైలో 20 మంది చనిపోయారు. పంటలకు భారీ నష్టం వాటిల్లింది. ఈ సహాయక చర్యలకు తమిళనాడు ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 9 వేల మంది అధికారులను ప్రత్యేకంగా నియమించింది.

