వేములవాడలో భారీ వర్షం
తెలంగాణలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో శుక్రవారం మధ్యాహ్నం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురుస్తుంది. దీంతో వాహనాల రాకపోకలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. రోడ్లపైకి వర్షం నీరు చేరింది. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉంది. వాతావరణ శాఖ అధికారులు సైతం గత రెండు రోజులుగా వర్షాలు కురుస్తాయనే విషయాన్ని కూడా తెలిపిన విషయం మనందరికీ తెలిసిందే. ఒక్కసారిగా వర్షం కురవడంతో వాతావరణం చల్లబడింది.

