NewsTelangana

నగరంలో భారీ వర్షం

నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. హైదరాబాద్ పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. మధ్యాహ్నం నుంచి ఉప్పల్, కోటి, చాదర్ ఘాట్, అబిడ్స్, సుల్తాన్ బజార్, జూబ్లీ హిల్స్, బంజారాహిల్స్, యూసుఫ్ గూడ ఏరియాల్లో వాన పడుతోంది. పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురియగా, మరికొన్ని చోట్ల భారీ వర్షం కురిసింది. దీంతో పలు చోట్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. తూర్పు , మధ్య బంగాళాఖాతంలో రేపు వాయుగుండం ఏర్పడే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.