హైదరాబాద్‌లో భారీ వర్షం
హైదరాబాద్‌లో మళ్లీ వర్షం మొదలయ్యింది. పలు ప్రాంతాలలో భారీగా వర్షం కురుస్తోంది. గత వారం రోజులుగా భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన హైదరాబాద్‌కు వరుణుడు రెండు రోజులపాటు తెరిపినిచ్చాడు. కానీ నేటి సాయంత్రం మళ్లీ మొదలయ్యింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కూకట్‌పల్లి, అబిడ్స్, పటాన్‌చెరువు, బేగంపేట, ఉప్పల్, కుత్పుల్లాపూర్, రామ్‌నగర్, కొంపల్లి, మారేడ్‌పల్లి, శేరిలింగంపల్లి, సికింద్రాబాద్‌లో వర్షం కురుస్తోంది. శనివారం వినాయక చవితి కావడంతో పండుగ ముందు విగ్రహాలు, పూజసామాగ్రి కొనుగోలుకు వర్షం అడ్డంకిగా మారింది.


 
							 
							