Home Page SliderTelangana

హైదరాబాద్‌లో భారీ వర్షం

ఈ ఏడాది  వేసవికాలం ప్రారంభమైనప్పటి నుంచి హైదరాబాద్‌లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూనే ఉన్నాయి. కాగా ఈ మహనగరాన్ని అప్పుడప్పుడు చిరు జల్లులు పలుమార్లు తడిపాయి. హైదరాబాద్‌ను మరోసారి వర్షాలు పలకరించాయి. ఈ రోజు సాయంత్రం హైదరాబాద్‌లో భారీ వర్షం ప్రారంభమైంది. అయితే సిటీలోని అఫ్జల్‌గంజ్,అబిడ్స్,నాంపల్లి,చార్మినార్,బాలాపూర్,సైదాబాద్,బండ్లగూడ,యాకత్‌పుర,చాంద్రాయణగుట్ట,హిమాయత్ నగర్,ఎల్బీనగర్,సరూర్‌నగర్,కోఠి,తదితర ప్రాంతాల్లో వడగళ్ల వాన కురుస్తోంది.అంతేకాకుండా భారీగా ఈదురుగాలులు వీస్తున్నాయి. కాగా నగరంలోని మరికొన్ని ప్రాంతాల్లో మేఘాలు కమ్ముకుని వాతావరణం చల్లగా మారింది. హైదరాబాద్‌లో గత కొన్ని రోజులుగా ఎండ తీవ్రత ఎక్కువగా నమోదవుతోంది. ఈ నేపథ్యంలో ఇవాళ కురుస్తున్న వర్షాలతో నగర ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది.