కొన్నిగంటల్లో భారీవర్షం..
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలలో కొన్ని గంటలలోనే భారీవర్షం కురవబోతోందని వాతావరణశాఖ హెచ్చరించింది. తెలంగాణలో రాష్ట్రంలో రెండురోజులపాటు అనేకచోట్ల వర్షాలు విస్తారంగా కురుస్తాయని ముందుగానే హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్, సికింద్రాబాద్, బేగంపేట, ఉప్పల్, నాచారం, బోడుప్పల్, రామంతాపూర్ వంటి ప్రాంతాలలో వర్షం ఇప్పటికే కురుస్తోంది. అనవసరంగా వర్షంలో బయటకు తిరగవద్దని అధికారులు పేర్కొన్నారు. డ్రైయిన్లు, లోతట్టు కాలనీల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.

