చెన్నైలో భారీ వర్షం
తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో వర్షం భీభత్సం సృష్టిస్తోంది. కాగా ఓ గంట క్రితం మొదలైన వర్షం ఎడతెరిపి లేకుండా పడుతూనే ఉంది. దీంతో అప్రమత్తమైన తమిళనాడు అధికారులు తమిళనాడులోని 5 జిల్లాలకు వరదలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాకుండా కృష్ణగిరి KRB డ్యామ్ నుంచి దిగువకు నీటిని విడుదల చేశారు. కృష్టగిరి,తిరువన్నామలై,సేలం,ఈరోడ్,ధర్మపురి జిల్లాలకు వరద ముప్పు పొంచి ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

