తెలంగాణకు భారీ వర్ష సూచన
తెలంగాణలోని పలు జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు జిల్లాలలో అధికారులను అప్రమత్తం చేశారు. మెదక్, మేడ్చల్ మల్కాజ్ గిరి, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలలో భారీ వర్షాలు పడవచ్చని ఐఎండీ పేర్కొంది. హైదరాబాద్ నగరంలో ఇప్పటికే పలు చోట్ల వర్షం కురుస్తోంది. ఏపీలోని నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాలలో కూడా వర్షాలు కురుస్తున్నాయి.

