ఎంపీకి ఫెమా ఉల్లంఘనలలో భారీ పెనాల్టీ
తమిళనాడులోని ఎంపీకి భారీ పెనాల్టీ పడింది. అధికార డీఎంకే పార్టీకి చెందిన ఎంపీ ఎస్. జగత్‌రక్షకన్‌కు విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం ఫెమా నిబంధనల ఉల్లంఘనల కింద ఎంపీతో పాటు ఆయన కుటుంబానికి కూడా రూ. 908 కోట్ల పెనాల్టీ విధించారు. ఫెమా చట్టం 37 ఏ ప్రకారం ఈడీ ఈ ప్రకటన చేసింది. 2020 సెప్టెంబరులో సీజ్ చేసిన రూ.89.19 కోట్ల రూపాయల మొత్తాన్ని జప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు తీర్పు వచ్చిందని, ఆ మేరకు చర్యలు తీసుకుంటున్నామని ఈడీ తెలిపింది. ఎంపీ ప్రస్తుతం అరక్కోణం లోక్‌సభ స్థానం నుండి గెలుపొందారు.

