Home Page SliderNational

ముంబయి విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత

ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన తనిఖీలలో భారీగా బంగారం పట్టుబడింది. నైరోబీకి చెందిన ఇద్దరు మహిళల వద్ద 33 కేజీల బంగారు కడ్డీలు లభ్యమయ్యాయి. వీటి విలువ ఏకంగా రూ.19 కోట్లు ఉంటుందని అంచనా. ఈ ఇద్దరిలో ఒక మహిళ గర్భవతి కూడా కావడం విశేషం. ఆమె విమానం దిగి గ్రీన్ ఛానెల్ ద్వారా బయటకు వెళ్తుండగా అనుమతి లేని వస్తువుల గురించి ప్రశ్నించిన అధికారులకు జవాబు చెప్పకపోవడంతో అనుమానం వచ్చి తనిఖీలు చేయగా లో దుస్తులలో 8 బంగారు కడ్డీలు, హ్యాండ్‌బాగ్‌లో టేప్‌తో చుట్టిన 20 బంగారు కడ్డీలు గుర్తించారు. అలాగే, మరో మహిళ వద్ద 61 బంగారు కడ్డీలు గుర్తించారు. ఆమె వద్ద 21 కిలోల పైగా బంగారం స్వాధీనం చేసుకున్నారు.