Home Page SliderNational

కాన్పూర్ రైల్వే స్టేషన్‌లో భారీ అగ్ని ప్రమాదం

కాన్పూర్ రైల్వే స్టేషన్‌లోని ఫుడ్‌కోర్టులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఇక్కడ అగ్నిప్రమాదం జరగడంతో ప్రయాణీకులు ఆందోళనకు గురయ్యారు. ఈ మంటలు అతివేగంగా అన్ని దిక్కులకు వ్యాపించాయి. సమాచారం అందడంతో అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన మంటలను ఆర్పే ప్రయత్నాలు చేశారు. కానీ అప్పటికే రైల్వే స్టేషన్ పైకప్పుకు కూడా మంటలు వ్యాప్తి చెందాయి. ఈ ఘటనలో ఎవరికీ ఏవిధమైన గాయాలు కాలేదు. కానీ భారీ ఆస్థినష్టం జరిగి ఉంటుందని అంచనాలు వేస్తున్నారు.