Home Page SliderInternational

హీట్ వేవ్స్ కారణంగా హజ్ యాత్రలో అపశ్రుతి-వెయ్యిమంది దుర్మరణం

పవిత్ర హజ్ యాత్రలో హీట్ వేవ్స్ విషాదాన్ని నింపుతున్నాయి. మక్కాలో 51 డిగ్రీలకు మించి నమోదవుతున్న ఉష్ణోగ్రతలు యాత్రికుల ప్రాణాలు తీస్తున్నాయి. ఈ సీజన్‌లో  ఈ యాత్రకు వచ్చిన వారిలో ఇప్పటి వరకూ వెయ్యిమందికి పైగా మరణించారు. వేడి ఉష్ణోగ్రతలు, వడగాల్పులు తట్టుకోలేక వీరు ప్రాణాలు విడిచారు. వీరిలో 90 మంది భారతీయులు కూడా ఉన్నట్లు సమాచారం. ఎక్కువగా ఈజిప్టుకు చెందిన వారు ఉన్నారని, ఇప్పటి వరకూ 18.3 లక్షల మంది ఈ హజ్ యాత్రలో పాల్గొన్నారని వార్తలు వస్తున్నాయి.