పాక్ గుండెల్లో గుబులు..
పాకిస్తాన్ కు భారత్ చుక్కలు చూపిస్తోంది. పాకిస్తాన్ లోని 9 ప్రాంతాల్లో ఏకకాలంలో భారత్ దాడులు చేసింది. లాహోర్, కరాచీ, రావల్పిండి, గుజ్రాన్వాలా, చక్వాల్, బహల్వాపూర్, మైనివాలి, చోర్ ప్రాంతాల్లో దాడులు జరిపింది. భారత్ డ్రోన్ దాడులు చేశాయని పాక్ ఆర్మీ డీజీ ప్రకటించారు. పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టం ను భారత్ ధ్వంసం చేసింది. సరిహద్దులు దాటి పాక్ భూభాగంలోకి డ్రోన్లు దూసుకెళ్లాయి. అర్దరాత్రి నుంచే పాక్ పై దాడులు కొనసాగుతున్నాయి.