కొవిషీల్డ్‌తో గుండెకు పొంచివున్న ముప్పు..తాజా అధ్యయనాల్లో వెల్లడి
మన దేశంలో కొవిడ్-19ను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్నోరకాల చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగానే విదేశాల నుంచి కొవిషీల్డ్ టీకాలను దిగుమతి చేసింది. అంతేకాకుండా వాటిని దేశంలో ఉండే ప్రతి ఒక్కరికి ఉచితంగా అందించింది. ఈ విధంగా కొవిడ్ మహమ్మారిని దేశం నుంచి తరిమికొట్టింది. అయితే ఈ కొవిషీల్డ్‌తో గుండెకు పెనుప్రమాదం పొంచి ఉందని భారత సంతతికి చెందిన ప్రముఖ హృద్రోగ నిపుణుడు అసీమ్ మల్హోత్ర వెల్లడించారు. ఈ కొవిషీల్డ్‌ను ఆక్స్‌ఫర్డ్- ఆస్ట్రాజెనెకా సంస్థలు ఉత్పత్తి చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ టీకా గుండెపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని ఆయన తెలిపారు. ఈ టీకా వల్ల గుండెపోటు, పక్షవాతం,రక్తం గడ్డకట్టడం వంటి సమస్యలు తలెత్తే అవకాశముందని మల్హోత్ర స్పష్టం చేశారు. ఈ కారణంగానే ఆయన MRNA టీకాలను నిషేదించాలని ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కొవిషీల్డ్ టీకాతో ఊహించిన దానికంటే ఎక్కువస్థాయిలోనే గుండెకు నష్టాలు ఉంటాయని ఆయన తాజాగా పేర్కొన్నారు. బ్రిటన్‌లో ఈ టీకా పొందినవారిలో 10% మందికి ఇప్పటికే ఈ సమస్య ఉత్పన్నమైందన్నారు.