Home Page SliderNational

కేజ్రివాల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

ఢిల్లీ సీఎం కేజ్రివాల్ లిక్కర్ స్కామ్‌లో జైలు పాలయిన విషయం తెలిసిందే. అయితే ఆయన ఇటీవల తాత్కాలిక బెయిల్‌పై బయటికి వచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన తనకు బెయిల్ మంజూరు చేయాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.కాగా బెయిల్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు దానిని వాయిదా వేసింది. కాగా ఈ నెల 19 కి దీనిపై తదుపరి విచారణ చేపట్టనున్నట్లు కోర్టు ప్రకటించింది. అయితే అదే రోజు కేజ్రివాల్ జ్యూడీషియల్ కస్టడీ ముగియనుంది. దీంతో ఆ రోజు ఏమవుతుందో అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.