జీవో 46 పై హైకోర్టు లో విచారణ
తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో 46ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై ప్రభుత్వం జీవో 46ను జారీ చేసింది. ఈ నేపథ్యంలో వెనుకబడిన కులసంఘాలు న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలు చేశాయి. పిటిషనర్ల తరఫున న్యాయవాది సుదర్శన్ వాదనలు వినిపించారు. అత్యవసర పిటిషన్ కింద విచారణ జరపాలని కోరారు. బీసీలలో ఏబీసీడీ వర్గాల ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వాలన్నారు.వెనుకబడిన కులాలకు రిజర్వేషన్లు కేటాయించాలని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. వాదనలు విన్న సీజే ధర్మాసనం శుక్రవారం విచారణ జరుపుతామని పేర్కొంది.

