Andhra PradeshHome Page Slider

చంద్రబాబు బెయిల్‌పై విచారణ వాయిదా

టీడీపీ అధినేత చంద్రబాబుకు ఇప్పుడప్పుడే బెయిల్ దొరికే సూచనలు కన్పించడం లేదు. కాగా చంద్రబాబు బెయిల్‌పై విచారణను హైకోర్టు ఈ నెల 17కు వాయిదా వేసింది. ఈ మేరకు కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీకి ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. స్కిల్ కేసులో బెయిల్ ఇవ్వాలని చంద్రబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాగా ఏసీబీ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ చంద్రబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు సుప్రీంకోర్టులో కూడా  చంద్రబాబు కేసుపై విచారణ కొనసాగుతుంది. అయితే నిన్న హైకోర్టులో చంద్రబాబుకు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు,అంగళ్లు కేసులో తాత్కలిక ఊరట లభించిన విషయం తెలిసిందే.