Andhra PradeshHome Page Slider

చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ ఈనెల 30కి వాయిదా

ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్‌పై విచారణ ఈనెల 30కి సుప్రీం కోర్టు వాయిదా వేసింది. కేసు విచారణను ఈ నెల 30 న చేపడతామని జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేది బెంచ్ పేర్కొంది. కేసు విషయంలో అరెస్టు జరగొచ్చన్న భావనతో చంద్రబాబు ముందస్తు బెయిల్ కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. మరోవైపు దీపావళి సెలవులు అనంతరం స్కిల్ కేసు తీర్పు వెలువరిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. ఆరోగ్య కారణాలు ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు ఇప్పటికే బెయిల్‌పై ఉన్నారని చంద్రబాబు తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టుకు వివరించారు. సుప్రీంకోర్టులో కేసు విచారణ ముగిసే వరకు చంద్రబాబును అరెస్టు చేయొద్దని న్యాయవాది సిద్ధార్థ లూధ్రా విజ్ఞప్తిని సుప్రీం కోర్టు పరిగణలోకి తీసుకొంది. ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబును ఈ నెల 30 వరకు అరెస్ట్ చేయొద్దని సుప్రీం కోర్టు సీఐడిని ఆదేశించింది.