చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. చంద్రబాబు తరపున సిద్ధార్థ్ లూధ్రా కేసు వాదించగా, సీఐడి తరపున ఏజీ శ్రీరామ్ వాదనలు విన్పించారు. ఇద్ది వాదనలు విన్న కోర్టు విచారణను అక్టోబర్ 3కి వాయిదా వేసింది. అంతకు ముందు, ఫైబర్ గ్రిడ్ కేసులో హైకోర్టు విచారణ వాయిదా వేసింది. వచ్చే నెల నాలుగో తారీఖున విచారణ జరపుతామని పేర్కొంది. మరోవైపు స్కిల్, ఫైబర్ నెట్ కేసుల్లో చంద్రబాబు తనయుడు నారా లోకేష్ కు స్వల్ప ఊరట లభించింది. వచ్చే నెల నాలుగు వరకు అరెస్టు చేయొద్దని కోర్టు సీఐడిని ఆదేశించింది.

