చంద్రబాబు బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బెయిల్ పిటిషన్ విచారణను ఏసీబీ కోర్టు ఈనెల 19కి వాయిదా వేసింది. ఈ నెల 19 లోపు కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీని కోర్టు ఆదేశించింది. హైకోర్టులో క్వాష్ పిటిషన్ పెండింగ్‌లో ఉండటాన్ని న్యాయమూర్తి ప్రస్తావించారు. మధ్యంతర బెయిల్‌పై విచారిస్తే క్వాష్ పిటిషన్‌పై ప్రభావం పడుతుందని జడ్జి చెప్పారు.