Andhra PradeshHome Page Slider

మూడు రాజధానుల పై నేడు సుప్రీంకోర్టులో విచారణ

ఏపీలో అగ్గి రాజేస్తున్న మూడు రాజధానుల అంశంపై దేశ సర్వోన్నత న్యాయస్థానంలో ఏం జరగబోతుందన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ నెలకొంది. దీనిపై సుప్రీంకోర్టులో విచారణ సమయం రానే వచ్చింది.రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతిని మాత్రమే కొనసాగించాలంటూ దాఖలైన పిటిషన్లు ప్రస్తుతం దేశ అత్యున్నత న్యాయస్థానంలో విచారణ దశలో ఉన్నాయి.ఈ క్రమంలోనే అధికార పార్టీ నేతలు ఉగాది పర్వదినం ముందుగాని తర్వాత గాని విశాఖ నుండి పరిపాలన కొనసాగిస్తామంటూ పదేపదే ప్రకటనలు గుప్పిస్తున్నారు. మూడు రాజధానులకే తాము కట్టుబడి ఉన్నామంటూ స్పష్టం చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే త్వరలో జరగబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనూ మూడు రాజధానులు పై బిల్లు పెట్టేందుకు కూడా ప్రభుత్వం ఆసక్తి కనపరుస్తోందంటూ కథనాలు వెలబడుతున్నాయి. ఇవన్నీ అసలు మూడు రాజధానులపై సుప్రీంకోర్టు ఏం చెప్పబోతుందని ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలోనే మంగళవారం సుప్రీంకోర్టులో దీనిపై విచారణ జరగనుంది. దీంతో ప్రజలు ,రాజకీయ నేతలు ,విశ్లేషకుల దృష్టింత సుప్రీంకోర్టు తీర్పుపై పడింది.

అమరావతిని ఆరు నెలల్లోగా అభివృద్ధి చేయాలంటూ ఏపీ హైకోర్టు దాఖలు చేసిన ఆదేశాలపై ఇదివరకే సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ పిటిషన్లపై తదుపరి విచారణను ఈ నెల 31వ తేదీన సుప్రీంకోర్టు చేపట్టనుంది. దీంతో ఆయా పిటిషన్లన్నీ మంగళవారం సుప్రీంకోర్టు సమక్షానికి విచారణకు రానున్నాయి. జస్టిస్ జోసెఫ్, జస్టిస్ నాగరత్నతో కూడిన ఇద్దరు న్యాయమూర్తులు ధర్మాసనం తమ విచారణను కొనసాగించనుంది. ప్రభుత్వం పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు వేణుగోపాల్, శ్యామ్ దివాన్ తమ వాదనలను వినిపించాల్సి ఉంటుంది. గతంలో చేపట్టిన విచారణ సందర్భంగా న్యాయమూర్తులు పలు కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అభివృద్ధిని ఒకే చోట కేంద్రీకరించడం సరైంది కాదని గతంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు తేల్చి చెప్పారు. ఈ పరిణామాల మధ్య మంగళవారం సుప్రీంకోర్టు ఎలాంటి ఆదేశాలను ఇస్తుందనేది ప్రస్తుతం ఆసక్తి రేపుతుంది.