చంద్రబాబు ఫైబర్ నెట్ కేసులో విచారణ వాయిదా
టీడీపీ అధినేత చంద్రబాబు ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోసం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసుపై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. కాగా ఈ కేసుపై విచారణను నవంబర్ 8కి వాయిదా వేస్తున్నట్లు జస్టిస్ అనిరుధ్ బోస్,జస్టిస్ బేలా ఎం.త్రివేదితో కూడిన ధర్మాసనం తెలిపింది. అయితే చంద్రబాబు తరుపు లాయర్ సిద్ధార్థ్ లుథ్రా నవంబరు 9న ఈ కేసుపై విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టును అభ్యర్థించారు. ఈ అభ్యర్థనను సుప్రీంకోర్టు బెంచ్ అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు నవంబరు 9న చంద్రబాబు ఫైబర్ నెట్ కేసుపై మరోసారి విచారణ జరగనుంది.