Andhra PradeshBusinessNews

తిరుపతిలో బడి వైన్స్ పేరు విన్నారా?

తిరుపతిలో ఇటీవల నూతన మద్యం విధానంలో భాగంగా ప్రారంభమైన కొత్త మద్యం షాపు ఓపెన్ చేశారు. దీనికి బడి వైన్స్ అని పేరు పెట్టారు. దీనితో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఈ బడి వైన్స్‌లో మందు చదువులు చెపుతారా, నాన్నలకు కూడా బడి తెరిచారా అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే ఈ పేరు కావాలని పెట్టింది కాదని, షాపు యజమాని ఇంటిపేరు బడి అని సమాచారం.