15-20% మేర పెరగనున్న హెల్త్ ప్రీమియమ్ ధరలు
15-18% పెరగనున్న ఆరోగ్యం బీమా
ఇన్సూరెన్స్ రంగంలో హెల్త్ బీమా వాటా 35-40%
10-15% పెంపునకు సిద్ధమైన ఐసీఐసీ లాంబార్డ్
స్టార్ హెల్త్ ఫ్యామిలీ హెల్త్ ఆప్టిమ ప్రిమియం 25% పెంపు
స్టార్ హెల్త్ టోటల్ ప్రిమియమ్స్‌లో స్టార్ హెల్త్ వాటా 45%
హెల్త్ ఇన్సూరెన్స్ పెంచే ఆలోచన లేదన్న న్యూఇండియా
25% ప్రిమియం పెంచే యోచనలో హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో
8-20% పెంచే యోచనలో కేర్, నివా, ఆదిత్య బిర్లా, రిలయన్స్
హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు దాదాపు 15-18% పెరగబోతున్నాయి. బీమా సంస్థ ఐసీఐసీఐ లాంబార్డ్ ప్రీమియమ్‌లను 10-15% పెంచగా, హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో 25% పెంచింది. కేర్ హెల్త్ ఇన్సూరెన్స్, నివా బుపా, ఆదిత్య బిర్లా, రిలయన్స్ జనరల్ ప్రీమియంలను 8-20% పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ‘ఫ్యామిలీ హెల్త్ ఆప్టిమా ప్లాన్’ ప్రీమియమ్‌లను 25% పెంచింది. స్టార్ హెల్త్ ఆప్టిమా ప్లాన్ ఒక సూపర్ సేవర్ ప్లాన్‌గా భావిస్తున్నారు. జీవిత భాగస్వామితో సహా మొత్తం కుటుంబ సభ్యులకు… 16 రోజుల నుండి 25 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలపై కవరేజీ అందిస్తోంది. భారతదేశంలో నివసించే 18 నుండి 65 సంవత్సరాల వయస్సు గల వారు ఈ పాలసీని కొనుగోలు చేయొచ్చు. ముఖ్యంగా, ఈ ప్రీమియమ్… స్టార్ హెల్త్ మొత్తం ప్రీమియమ్ వాటాలో 45% వరకు ఉంది. మరోవైపు… న్యూ ఇండియా ప్రీమియమ్‌లలో గణనీయమైన పెంపుదల చేయలేదు. సాధారణ బీమా పరిశ్రమ ప్రీమియమ్‌లలో ఆరోగ్య బీమా దాదాపు 35% వాటా కలిగి ఉన్నాయి.

ఆరోగ్య సంరక్షణ రంగంలో ద్రవ్యోల్బణం ఎక్కువవుతోంది. ధరల పెరుగుదల బీమాపై ప్రభావం చూపుతోంది. భారతీయ ఆర్థిక సేవల సంస్థ మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ నివేదిక ప్రకారం, భారతదేశంలో ఆరోగ్య ద్రవ్యోల్బణం పెరుగుతూనే ఉంది. గత ఏడాది కాలంలో ఆస్పత్రుల గదుల అద్దెలు 3-4% పెరిగాయని నివేదిక పేర్కొంది. బీమా పెంపుదలలో అనేక అంశాలు ప్రభావితం చేస్తాయి. క్లెయిమ్ ఫ్రీక్వెన్సీ కూడా ఇక్కడ కీలక పాత్ర పోషిస్తుంది. క్లెయిమ్ ఫ్రీక్వెన్సీ రేటు… క్లెయిమ్‌లు చేసే బీమా చేసినవారి అంచనా శాతం, నిర్దిష్ట వ్యవధిలో వారు చేసే క్లెయిమ్‌ల సంఖ్యను బట్టి.. ప్రీమియంను నిర్ణయిస్తారు. ఇది క్లెయిమ్‌ల అంచనా వేసిన సగటు ధరను లెక్కించి… ప్రీమియం రేట్లను నిర్ధారించడానికి ఉపయోగపడుతుంది.