కోడిపిల్లను బతికుండగానే మింగేశాడు..తర్వాతేమయిందంటే..
ఛత్తీస్‌గఢ్‌లో అంబికాపూర్‌ని ఆనంద్ యాదవ్(35) అనే వ్యక్తి మూఢనమ్మకంతో కోడిపిల్లను బతికుండగానే మింగేశాడు. అతడికి పిల్లలు లేకపోవడంతో తాంత్రికుడిని కలుసుకున్నాడు. అతని సూచన మేరకు, పిల్లలు పుడతారని బతికున్న కోడిపిల్లను మింగేశాడు. అయితే ప్రమాదవశాత్తూ అది గొంతులోనే ఇరుక్కుపోయింది. దీనితో ఊపిరాడక మరణించాడు. అయితే విచిత్రం ఏమిటంటే పోస్టుమార్టం సమయంలో ఆ కోడిపిల్ల బతికే ఉందని వైద్యులు గుర్తించారు. 20 సెంటీమీటర్ల కోడిపిల్ల గొంతుల్లో ఇరుక్కుపోవడంతో గాలి ఆడక ఆనంద్ మరణించాడు.