‘అతనికి ఉరిశిక్ష వేయాలి’..ఇరాన్ సుప్రీం లీడర్ డిమాండ్
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యూహుకు ఉరిశిక్ష వేయాల్సిందేనని ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ డిమాండ్ చేస్తున్నారు. గాజా, లెబనాన్‌లో ఇజ్రాయెల్ సైనిక చర్యపై మండిపడ్డారు ఖమేనీ. “వారు అక్కడ ప్రజలపై బాంబులు విడవడం విజయం కాదు. వారు మూర్ఖులు ప్రజల ఇళ్లు, వైద్యశాలలు, కమ్యూనిటీలపై బాంబులు వేస్తున్నారు. వారిపై ఐసీసీ అరెస్టు వారంట్ మాత్రమే జారీ చేశారు. అది సరిపోదు, నెతన్యాహుకు, మాజీ రక్షణ మంత్రి గ్యాలెంట్‌లకు మరణశిక్ష విధించాలన్నారు”. గాజాలో హత్యలు, ఆకలిచావులు, అమానవీయ చర్యలకు వారే బాధ్యత వహించాలన్నారు.

