Home Page SliderPoliticsTelanganatelangana,

‘ఆయనకు భారత రత్న ఇవ్వాలి’.. రేవంత్ రెడ్డి

తెలంగాణ అసెంబ్లీలో నేడు దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు సంతాప తీర్మానం ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. దివంగత్ మన్మోహన్ సింగ్ నేటి ఆధునిక భారత ఆర్థిక సంస్కరణల రూపశిల్పి అని కొనియాడారు. ఆయనకు భారత రత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఇప్పుడు ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఆర్టీఐ యాక్ట్, ఉపాధి హామీ పథకాలు ఆయన చలవేనని పేర్కొన్నారు. ఆయన కేంద్ర ఆర్థిక శాఖ సలహాదారుగా, ఆర్బీఐ గవర్నర్‌గా పని చేసిన అనుభవంతో దేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశం వైపుగా పరుగులు పెట్టించారని పేర్కొన్నారు. ప్రణాళికా సంఘం డిప్యూటీ ఛైర్మన్‌గా, కేంద్ర ఆర్థిక మంత్రిగా 1991 నుండి 96 మధ్య ఆర్థిక వ్యవస్థకు ఊపిరందించారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఆయన ప్రవేశ పెట్టిన సరళీకృత విధానాల కారణంగా భారతదేశం ఆధునిక దేశాలతో పోటీ పడుతోందని పేర్కొన్నారు.