Home Page SliderTelangana

పంటలు వేసిన భూములకే రైతు భరోసా

దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో రైతు రుణమాఫీ చేశామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు. రాహుల్ మాట ప్రకారం 2018 నుంచి 2023 డిసెంబర్ వరకు ఉన్న రుణాలు మాఫీ చేశామన్నారు. ఇప్పటి వరకు 18 వేల కోట్ల రుణమాఫీ చేశామని తుమ్మల తెలిపారు. రైతు బీమా కూడా ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. పంటలు వేసిన భూములకే రైతు భరోసా ఇస్తామని మంత్రి పేర్కొన్నారు. పంటలకు పనికి రాని భూములకు రైతు భరోసా ఇవ్వబోమన్నారు. రుణమాఫీపై ప్రతిపక్షాల విమర్శలను పట్టించుకోవద్దన్నారు. సన్న వడ్లకు క్వింటాల్ కు రూ. 500 బోనస్ ఇస్తామని చెప్పారు తుమ్మల.