రివర్స్ గేర్ వేశాడు.. చివరికి ఏం జరిగిందంటే..?
పూణె విమన్ నగర్ లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. పార్కింగ్ ఏరియాలో కారును ముందుకు తీయబోయి.. పొరబాటున రివర్స్ గేర్ వేశాడు కారు డ్రైవర్. దాని తర్వాత ఏం జరిగిందంటే.. ఫస్ట్ ఫ్లోర్ నుంచి అమాంతం కారు కింద పడిపోయింది. వాహనం పార్కింగ్ గోడను పగులగొట్టి మరీ నేలకు గుద్దుకుంది. అయితే.. ఈ ప్రమాదంలో ఎవరికీ ఏ గాయం కాలేదు. డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదం అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. అది కాస్త బయటకు రావడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విమన్ నగరలోని గేట్ వే అపార్ట్ మెంట్ లో గత ఆదివారం ఉదయం ఈ ఘటన జరగగా.. ఆలస్యంగా వీడియో బయటకు వచ్చింది.

