గోవులను ఆకర్షిస్తున్న మ్యూజిక్
మనసర్కార్
“శిశుర్వేత్తి, పశుర్వేత్తి, వేత్తి గానరసం ఫణి” అన్నారు. అంటే శిశువులు, పశువులు, పాములు అన్నీ గానానికి ఆనందిస్తాయని అర్ధం.
మన పురాణాలలో కూడా శ్రీకృష్ణుడు మురళీనాదానికి గోవులన్నీ చుట్టూ చేరేవని, గోపికలంతా మంత్రముగ్ధులయ్యారనీ కథలలో వింటూ ఉంటాం. ఇలాంటి సంఘటనే ఇక్కడా జరిగింది. ఒక వ్యక్తి ఆధునిక కృష్ణునిలా సాక్సోఫోన్ వాయిస్తుంటే దగ్గరలో గడ్డి మేస్తున్న ఆవులన్నీ పరుగున వచ్చి, చుట్టూ చేరాయి. సృష్టిలో ప్రతి జంతువూ సంగీతానికి స్పందిస్తుందనీ, సంగీతానికి ఉండే శక్తి చాలా గొప్పదని నిరూపించాడు ఆ వ్యక్తి. ఈ వీడియోను ట్విటర్లో షేర్ చేస్తూ ‘THE POWER OF MUSIC’అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోను 10 లక్షల మందికి పైగా చూసారు. ఎన్నో లైకులు, కామెంట్లు వచ్చాయి. చాలామంది ఈయనను మోడ్రన్ కృష్ణుడంటూ పొగుడుతున్నారు.

