గంజాయి తాగించి స్నేహితుడిని మర్డర్ చేశాడు
తెలంగాణ : గంజాయి మత్తులో అరాచకాలు పెరిగిపోతున్నాయి. ఇటీవల ఓ బాలికకు గంజాయి అలవాటు చేసి అత్యాచారం చేయగా, తాజాగా ఓ యువకుడు ఫ్రెండును చంపేశాడు. హైదరాబాద్ బాలానగర్‌లో స్నేహితులు ప్రణీత్ (20), సమీర్ (20) గంజాయికి బానిసలయ్యారు. ఇటీవల సమీర్ తల్లిని ప్రణీత్ దూషించాడు. ఇది మనసులో పెట్టుకున్న సమీర్.. నిన్న ఉదయం ప్రణీత్‌ను బయటకు తీసుకెళ్లాడు. గంజాయి తాగించి కత్తితో పొడిచేశాడు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.