Andhra PradeshHome Page Slider

డ్రగ్స్‌ మత్తులో అన్న కుటుంబాన్ని హతమార్చాడు

భారత్‌: పంజాబ్‌లోని మొహాలి జిల్లాలో మత్తు పదార్థాలకు బానిసైన ఓ యువకుడు సొంత అన్న కుటుంబాన్ని అంతం చేశాడు. గ్లోబల్ సిటీ ఖరడ్‌లో ఈ దుర్ఘటన జరిగింది. ఆర్థికంగా స్థిరపడిన అన్న సత్వీర్‌సింగ్‌పై అతడు కక్ష పెంచుకున్నాడు. సత్వీర్‌సింగ్, అమన్‌దీప్ కౌర్ దంపతులతోపాటు వారి కుమారుడు లఖ్‌వీర్ సింగ్‌ను చంపేశాడు. ముందుగా అన్నభార్యను కత్తితో పొడిచి.. అనంతరం అన్నను పారతో బాది హత్య చేశాడు. ఆ తర్వాత రెండేళ్ళ చిన్నారిని వదలిపెట్టలేదు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. అతడికి సహాయం చేసిన మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు.