82లక్షల జీతాన్ని కాదని.. స్వీపర్‌గా చేరాడు
కెరీర్ లో అతి పెద్ద ఉద్యోగం. అత్యంత పెద్ద జీతం. కానీ వాటితో ఆనందం కలగలేదు. ఆఫీసు వాతావరణ అస్సలు నచ్చలేదు. జీవితం అంటే ఇది కాదనుకున్నాడు. ఆఫీసులో జరిగే ఏ విషయంలోనూ సంతృప్తి కలగలేదు. అందుకే ఉద్యోగం వదిలేశాడు. అందుకే మెక్ డొనాల్డ్స్ కంపెనీలో స్వీపర్‌గా చేరాడు. ఆస్ట్రేలియాకు చెందిన పాల్ అనే వ్యక్తి చేసిన పనికి అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. బిజీ లైఫ్ బోర్ కొట్టిన కారణంగా తనకు వస్తున్న రూ.82 లక్షల జీతం వదులుకొని స్వీపర్‌గా చేరాడు. 23 ఏళ్ల పాటు ఫైనాన్స్ రంగంలో చేసిన ఉద్యోగంలో… వెనక్కి తిరిగి చూసుకుంటే ఉరుకులు, పరుగులు, జీతం, సమావేశాలు, తప్ప ఇంకేమీ మిగల్లేదన్న ఆవేదన తనను ఆ ఉద్యోగం వదలుకోడానికి కారణమయ్యిందన్నాడు. ఎన్ని కంపెనీలు మారిన తనకు నచ్చలేదు. సంతృప్తి కలగలేదు. ప్రస్తుతం వస్తున్న లక్షల జీతాన్ని కాదని… చిన్నప్పుడు స్వీపర్‌గా పనిచేసిన మెక్‌డొనాల్డ్స్‌లోనే మళ్లీ స్వీపర్ జాబ్‌లో చేరి సంతోషాన్ని వెదుక్కుంటున్నానంటున్నాడు.

