ఐపీఎల్‌లో తొలిబోణీ కొట్టిన సచిన్ తనయుడు
ఐపీఎల్ మ్యాచ్‌లో క్రికెట్ మాంత్రికుడు సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ వికెట్ తీసి బోణీ కొట్టాడు. ముంబయి ఇండియన్స్ టీమ్‌లో ఈ సీజన్‌లో ఆరంగేట్రం చేసిన అర్జున్ 19.5 ఓవర్ల వద్ద హైదరాబాద్ టీమ్‌కు చెందిన భువనేశ్వర్‌ను ఔట్ చేసి ఔరా అనిపించుకున్నాడు. ఈ విషయాన్ని ఇండియన్ ప్రీమియర్ లీగ్ ట్విటర్‌లో పంచుకుంది. ఉప్పల్ స్టేడియంలో నిన్న జరిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబయి ఇండియన్స్ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ టీమ్ విజయం సాధించింది. ముంబయి నిర్దేశించిన 193 పరుగుల లక్ష్యాన్ని హైదరాబాద్ అందుకోలేక పోయింది. 19.5 ఓవర్లలో 178 పరుగులకే అందరూ ఔట్ అయ్యారు.