‘వికారాబాద్ ముఖ్యమంత్రి ఆయనే’..కేటీఆర్ సెటైర్లు
‘ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతి రెడ్డి సామాన్యుడు కాడని, వికారాబాద్‌కు సీఎం’ అని బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ సెటైర్లు వేశారు. తాజాగా తన ఎక్స్ ఖాతాలో తిరుపతి రెడ్డి వికారాబాద్ పర్యటన వీడియో విడుదల చేశారు. కనీసం వార్డు మెంబర్ కూడా కాని రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డికి పోలీసులు రాజమర్యాదలు చేయడం, కాన్వాయ్ ఏర్పాటు చేయడంపై విమర్శలు కురిపించారు. ‘స్కూల్ పిల్లలను ఎండలో నిలబెట్టి రాష్ట్రపతికి, ప్రధానికి చేయించినట్లు పరేడ్ చేయించారు. తిరుపతి రెడ్డి ముఖ్యమంత్రా?’ అంటూ మండిపడ్డారు. తెలంగాణలో అనుముల కుటుంబపాలన నడుస్తోందంటూ విమర్శించారు.