ఇకపై టాటా ట్రస్ట్స్ ఛైర్మన్ ఆయనే..
రతన్ టాటా మరణంతో యావత్ దేశం శోకంలో మునిగిపోయింది. భారతదేశానికి పారిశ్రామిక రంగంలో అంతర్జాతీయ స్థాయిలో ఎంతో పేరు సంపాదించిన టాటా గ్రూప్ ఛైర్మన్‌గా ఆయన సేవలు మరపురానివి. అయితే టాటా ట్రస్ట్స్ ఛైర్మన్‌గా ఇంతకాలం కొనసాగిన ఆయన తర్వాత ఎవరు ఛైర్మన్ అవుతారనేది ఆసక్తిగా మారింది. రతన్ టాటా సవతి తల్లి సిమోన్ టాటా కుమారుడైన నోయల్ టాటా ఇకపై ఈ బాధ్యతలు నిర్వహిస్తారని ట్టా ట్రస్ట్ ప్రకటించింది. టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ అయిన టాటా సన్స్‌లో టాటా ట్రస్ట్స్‌కు అత్యధికంగా 66 శాతం వాటా ఉంది. ఇప్పటికే నోయల్ టాటా గ్రూప్ ఈ బోర్డులో సభ్యునిగా ఉన్నారు. ఇంకా టాటా గ్రూపులోని వోల్టాస్, టాటా ఇన్వెస్ట్‌మెంట్, టాటా ఇంటర్నేషనల్, టాటా స్టీల్, టైటాన్ వంటి గ్రూపు కంపెనీలకు వైస్ ఛైర్మన్‌గా ఉన్నారు. ఇప్పుడు ఈయన గ్రూప్ కంపెనీల కార్యకలాపాలు, వృద్ధి విషయంలో కీలక పాత్రను పోషించబోతున్నారు.