Home Page SliderInternational

‘ఆయన దేశభక్తుడు..ప్రజల కోసమే కఠిన వైఖరి’- మోదీపై పుతిన్ ప్రశంసల జల్లు

ప్రధాని నరేంద్రమోదీ సారథ్యంలో భారత్ చాలా త్వరితగతిన పురోగతి సాధించిందని, ఆయన గొప్ప దేశభక్తుడని ప్రధాని మోదీపై ప్రశంసల జల్లు కురిపించారు రష్యా అధ్యక్షుడు పుతిన్. భారత్ ప్రజలకు, వారి ప్రయోజనాలకు వ్యతిరేకంగా మోదీపై ఒత్తిడి తీసుకురావడం అసాధ్యమని అభిప్రాయపడ్డారు. ప్రజల కోసమే మోదీ కఠిన వైఖరి అవలంభిస్తారని పేర్కొన్నారు. మేకిన్ ఇండియా ఆలోచన చాలా ఆర్థికాభివృద్ధిలో చాలా కీలక పాత్ర పోషించిందన్నారు. ప్రపంచంలోనే భారత్ అతిపెద్ద ప్రజాస్వామ్యదేశం అయినందుకు సంతోషంగా ఉందన్నారు. భారత్, రష్యా మధ్య లోతైన బంధాలకు మోదీ విధానాలే గ్యారంటీ అని వ్యాఖ్యానించారు పుతిన్. మోదీజీ ప్రజల కోసం తీసుకునే కఠిన నిర్ణయాలు చూస్తే ఆశ్చర్యంగా ఉంటుందన్నారు. భారత్, రష్యా సంబంధాలు నిరంతరం ఇలాగే అభివృద్ధి చెందాలని ఆశాభావం వ్యక్తం చేశారు. భవిష్యత్తు భారతదేశానిదే అంటూ కితాబిచ్చారు.