ఈయనకు నెలకు రూ.1458 కోట్ల జీతం ఎందుకంటే..
14 ఏళ్ల క్రితం సాధారణ ఉద్యోగిగా జీవితం మొదలుపెట్టిన జగ్దీప్ సింగ్ అనే వ్యక్తి ప్రపంచంలోనే అత్యధిక జీతం పొందుతున్న వ్యక్తిగా రికార్డుకెక్కాడు. ఇప్పుడు నెలకు రూ.1458 కోట్ల రూపాయల జీతం సంపాదిస్తూ పెద్దపెద్ద మల్టీ నేషనల్ కంపెనీల సీఈవోలకే షాక్ ఇచ్చాడు. అతని జీతం రోజుకు రూ.48 కోట్లతో ప్రపంచ కుబేరులనే అశ్చర్యపరుస్తున్న ఈ వ్యక్తి భారతీయుడు కావడం విశేషం. 2020కి ముందు అనేక కంపెనీలలో ఉద్యోగాలు చేసిన జగ్దీప్ సింగ్ ‘క్వాంటం స్కేప్’ అనే కంపెనీని స్థాపించి ఈ ఘనత సాధించారు. అభివృద్ధికి చిరునామాగా, నూతన సాంకేతికతను అందిపుచ్చుకుంటూ ‘సింగ్ ఈజ్ కింగ్’ అనిపించుకున్నారు. ఈ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్ల తయారీకి అవసరమయ్యే టెక్నాలజీని అందిస్తోంది. నెక్ట్స్ జనరేషన్ టెక్నాలజీని కనిపెడుతూ లక్షల కోట్లు పెట్టుబడులు విశేషంగా సంపాదిస్తోంది. ఈయన అమెరికాలోని స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ నుండి బీటెక్, కాలిఫోర్నియా యూనివర్సిటీ నుండి ఎంబీఏ పట్టాను పొందారు.

