Home Page SliderNational

ట్రాఫిక్ పోలీసును కారు బానెట్ పై ఈడ్చుకెళ్లాడు..

కర్ణాటకలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. రాష్ట్రంలోని శివమొగ్గలో విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీసును ఓ వ్యక్తి కారు బానెట్ పై ఈడ్చుకెళ్లాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. కారు నడుపుతున్న ఓ వ్యక్తి అతివేగంగా డ్రైవింగ్ చేస్తున్నందుకు ట్రాఫిక్ పోలీస్ ఆపమని అడిగాడు. కానీ, ఆపమని కోరుతున్న ట్రాఫిక్ అధికారిని ఢీకొట్టాడు. దీంతో కారు ఆ అధికారి బానెట్ పై పడ్డాడు. వాహన తనిఖీ చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. వ్యక్తి కారు బానెట్ పైన ట్రాఫిక్ అధికారితో 100 మీటర్లకు పైగా ఈడ్చుకెళ్లినట్లు తెలుస్తోంది. ట్రాఫిక్ అధికారి అదృష్టవశాత్తూ ప్రాణపాయం నుంచి తప్పించుకున్నాడు. ఈ ఘటనతో కారు నడుపుతున్న వ్యక్తి పై కేసు నమోదు చేసినట్లు శివమొగ్గ పోలీసు సూపరింటెండెంట్ వెల్లడించారు.