సరదా కోసం చెయిన్ లాగాడు.. పోలీసులేం చేశారంటే!?
కొంత మంది సరదా కోసం అనాలోచితంగా ప్రవర్తిస్తుంటారు. సరదా ఒక్కోసారి వారి ప్రాణాల మీదికి తెస్తుంటుంది. ఒక్కోసారి ఇతరులని ఇబ్బంది పెడుతుంటుంది. బెంగళూరుకు చెందిన ఒక వ్యక్తి అలానే ప్రవర్తించాడు. బెంగళూరుకు చెందిన 21 ఏళ్ల యువకుడు బుధవారం సాయంత్రం నమ్మ మెట్రో పర్పుల్ లైన్‌లో ప్రయానిస్తూ ఎమర్జెన్సీ బటన్‌ను ప్రెస్ చేసాడు. అప్పుడు మెట్రో 10 నిమిషాల వరకు ఆగిపోయింది. ఈ సంఘటన 4.20 గంటలకు, M.G. రోడ్ స్టేషన్ వద్ద జరిగింది. ఆ తరువాత అతను మెట్రో దిగి కబ్బన్ పార్క్ స్టేషన్‌కి వెళ్ళాడు. మెట్రో ఆగడం వల్ల ప్రయాణీకులు ఇబ్బంది పడ్డారు. ఆ తరువాత సిబ్బంది ఏమైంది అని చూడగా సీసీ ఫుటేజ్‌లో జరగింది కనిపించింది. వెంటనే అతనిని పట్టుకోని రూ.5000 జరిమానా విధించారు. ఆ సమయంలో అతని వద్ద సరిపడా డబ్బులు లేక అతని తల్లిదండ్రులని పిలిపించారు. వారు వచ్చి ఫైన్ కట్టి అతనిని తీసుకొని వెళ్ళారు.