కూతురితో చనువుగా ఉన్నాడని గొంతు కోసేశాడు
అల్లారు ముద్దుగా పెంచిన కూతుళ్ల కోసం తండ్రులే తీర్పులిచ్చేస్తున్నారు.మొన్నామధ్యన రాయలసీమలో ఓ తండ్రి …తన కూతురి పట్ల తాత వయసున్న వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించాడని తెలుసుకుని కువైట్ నుంచి వచ్చి హత్య చేసి తిరిగి కువైట్ వెళ్లిపోయిన సంగతి తెలిసిందే.తాజాగా.. తన కూతురితో ఒంటిరిగా ఉన్న ఓ యువకుడిపై తండ్రి కిరాతకంగా దాడి చేశాడు. దాంతో కూతురు కూడా ఆత్మహత్యకు పాల్పడింది.హనుమకొండ జిల్లా గోపాల్‌పూర్‌లో తన ఇంట్లో కూతురుతో చనువుగా ఉన్న భరత్ అనే యువకుడిపై బాలిక తండ్రి దాడి చేసి గొంతు కోశాడు.దీంతో యువకుని పరిస్థితి విషమంగా మారింది.ఈ ఘటనను చూసిన బాలిక ఆత్మహత్య చేసుకుంది.విషయం తెలుసుకున్న అబ్బాయి బంధువులు ..అమ్మాయి ఇంటికి చేరుకుని దాడికి యత్నించారు.ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది .పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
Breaking news: మహా కుంభమేళాలో ఘోరం..15 మంది మృతి

