గుండెపోటుతో కూర్చిలోనే కుప్పకూలాడు
ఇటీవల గుండెపోటుతో మరణించే వారి సంఖ్య పెరిగింది. మొన్న గుజరాత్‌లో డాన్స్ చేస్తూ ఓ యువకుడు మరణించిన వార్త మరువక ముందే అటువంటి తరహా వార్త మరొకటి అలస్యంగా వెలుగులోకి వచ్చింది. తాజాగా మరో వ్యక్తి జిమ్‌లో వ్యాయమం చేసి , తరువాత కుర్చీలోనే కుప్పకూలిపోయాడు. యూపీలోని ఘజియాబాద్‌కి చెందిన అదిల్ సొంతంగా జిమ్ నిర్వహిస్తున్నాడు. కొన్ని రోజులుగా జ్వరం ఉన్నప్పటికీ జిమ్ చేసి వచ్చి కుర్చీలో కుర్చున్నాడు. అయితే కుర్చున్న కొద్దిసేపటికే గుండెపోటు రావడంతో కుర్చీలోనే కుప్పకూలిపోయాడు. అక్కడే ఉన్న కొందరు అతనిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతను చనిపోయినట్టు వైద్యులు వెల్లడించారు. ఆదివారం రాత్రి 7గంటల సమయంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. కాగా అదిల్ కు నలుగురు పిల్లలు ఉన్నారు. తండ్రి మరణించడంతో ఆ కుటుంబంలో పెను విషాదం అలముకొంది

