గుడ్డిగా నమ్మి ప్రాణాలు విడిచాడు
గూగుల్ మ్యాప్స్ నమ్మి ప్రాణాలు కోల్పోయాడు ఓ వ్యక్తి. తన కారుతో సహా 30 అడుగుల లోతైన కాలువలో పడి దుర్మరణం చెందాడు. నోయిడాలో ఈ ఘటన వెలుచూసింది. ఆ మ్యాప్ తప్పు మార్గాన్ని చూపించి ఉండవచ్చని స్థానికులు చెబుతున్నారు. కానీ పోలీసులు ఈ ఘటనపై ఎలాంటి ప్రకటన చేయలేదు. మృతుడిని ఢిల్లీలోని మండవలి నివాసి భరత్ సింగ్( 31) గా గుర్తించారు. ఆయన స్టేషన్ మాస్టర్‌గా పనిచేస్తున్నారని పోలీసులు తెలిపారు. ఈ సంఘటన గ్రేటర్ నోయిడాలోని సెక్టార్ P4లో జరిగింది.కారు వేగంగా వెళుతోందని, అకస్మాత్తుగా కాలువలో పడిపోయిందని ప్రత్యక్ష సాక్షి సౌరభ్ తెలిపారు. స్థానికులు సహాయం చేసేందుకు ప్రయత్నం చేశారు. కానీ కారు బోల్తా పడి నీటితో నిండిపోయింది. కాగా భరత్ సింగ్ గూగుల్ మ్యాప్స్ సహాయంతో నావిగేట్ చేస్తున్నప్పుడు డెడ్ ఎండ్ వద్ద ప్రమాదం జరిగి ఉండవచ్చని సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.


 
							 
							