మంత్రి విడదల రజినికి హైకోర్టు నోటీసులు
గ్రానైట్ తవ్వకాలకు ఎన్‌వోసీ జారీ అంశంలో మంత్రి విడదల రజినికి ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎన్టీఆర్ జిల్లా మొరకపూడిలో 91 ఎకరాల అసైన్డ్ భూమిలో తవ్వకాలకు అనుమతించడంతో మంత్రి రజిని హస్తం ఉందంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. వివరణ ఇవ్వాలంటూ విడదల రజినితో పాటు స్థానిక తహసీల్దార్‌కు నోటీసులు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను 3 వారాలపాటు వాయిదా వేసింది. ఇదే వ్యవహారంలో కడప ఎంపీ అవినాశ్‌రెడ్డి మామ ప్రతాప్‌రెడ్డికి కూడా హైకోర్టు నోటీసులు జారీ చేసింది.